Railway: ఆ ప్రచారంలో వాస్తవం లేదు: ఉద్యోగుల ఆందోళనపై రైల్వేశాఖ వివరణ

  • సాధారణ సమీక్షలో భాగంగానే లేఖలు
  • గతంలో కూడా ఇలాంటి రివ్యూలు చేపట్టాం
  • ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమీక్ష

30 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారు, 55 ఏళ్లు నిండిన ఉద్యోగులలో విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని వారితో స్వచ్చంద పదవీ విరమణ చేయించడానికి రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోందంటూ తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి వారిని గుర్తించి తమకు తెలపాలని ప్రాంతీయ కార్యాలయాలకు రైల్వే శాఖ లేఖలు రాసిందంటూ వార్తలొచ్చాయి. దీంతో ఉద్యోగులలో అభద్రతా భావం నెలకొంది.

ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి వివరణ ఇచ్చింది. ఈ ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది. సాధారణ సమీక్షలో భాగంగానే జోనల్ అధికారులకు లేఖలు పంపామని, గతంలో కూడా ఇలాంటి రివ్యూలు చేపట్టినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రైల్వే పాలనా యంత్రాంగం ఈ సమీక్ష చేపట్టిందని, దీనిలో భాగంగానే జోన్, ప్రొడక్షన్ యూనిట్లకు లేఖ రాసినట్టు తెలిపింది.  

  • Loading...

More Telugu News