Jagan: జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌లకు ఈడీ ట్రైబ్యునల్ లో ఊరట
- జప్తును రద్దు చేయాలని ట్రైబ్యునల్ ఆదేశాలు
- రూ.538 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
- నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రూ.325 కోట్ల ఆస్తుల జప్తు
ఏపీ సీఎం జగన్, నిమ్మగడ్డ ప్రసాద్‌ల ఆస్తులకు సంబంధించి ఈడీ ట్రైబ్యునల్ తాజాగా వారికి ఉపశమనం కలిగే ఆదేశాలు జారీ చేసింది. వాన్‌పిక్ కేసులో జగన్ కు చెందిన రూ.538 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గతంలో జప్తు చేసింది. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రూ.325 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇప్పుడు వీటిని విడుదల చేయాలని ట్రైబ్యునల్ ఆదేశించింది.
ఈ కేసులో జగన్‌కు చెందిన ఇడుపులపాయలోని 42 ఎకరాలు, బంజారాహిల్స్ సాగర్ సొసైటీలో ప్లాట్లు, పులివెందులలో 16 ఎకరాలు.. మొత్తం రూ.538 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అలాగే వాన్‌పిక్ భూములు సహా, నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన రూ.325 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.