Maharashtra: నాసిక్‌లో గోదావరి ఉగ్రరూపం.. మునిగిన ఆలయాలు
- మహారాష్ట్రలో భారీ వర్షాలు
- ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్న గోదావరి
- ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాసిక్ లో గోదావరి ఉగ్రరూపం దాల్చి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తుండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు గోదావరి పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి. నదిని ఆనుకుని ఉన్న ఆలయాలన్నీ మునిగిపోయాయి. నది మహోగ్రరూపం దాల్చడంతో ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.. వారికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. ముంపు పొంచి ఉన్న గ్రామాలను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ నది సమీపంలోకి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.