Krishna: నిండుతున్న శ్రీశైలం జలాశయం!
- ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం
- జూరాల నుంచి 1.90 లక్షల క్యూసెక్కుల వరద
- శ్రీశైలం రిజర్వాయర్ కు చేరిన జూరాల నీరు
ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో, కృష్ణానదిలో వరద నీరు గంటగంటకూ పెరుగుతోంది. నిన్న జూరాల జలాశయం నుంచి నీటిని వదలగా, ఈ ఉదయం ఆ నీరు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరింది. జూరాల వద్ద 1.90 లక్షల వరద ప్రవాహం ఉండగా, వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు వదులుతున్నారు. పశ్చిమ కనుమల్లో వర్షాలు కొనసాగుతుండగా, ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండిపోయిన సంగతి తెలిసిందే.
శ్రీశైలం జలాశయం మొత్తం నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 804 అడుగుల మేరకు నీరుంది. ఇదే సమయంలో తుంగభద్ర, బీమ నదుల్లో మాత్రం వరద తగ్గుముఖం పట్టింది. తుంగభద్రలోకి 15,281 క్యూసెక్కులు, బీమా నుంచి ఉజ్జయిని లోకి 55 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది.