Bay of bengal: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు
- 4న బంగాళాఖాతంలో అల్ప పీడనం
- వచ్చే మూడు రోజుల్లో ఓ మోస్తరు వర్షాలు
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వచ్చే నెల నాలుగో తేదీన ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని, దీనికి అనుబంధంగా 5.8 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు వివరించారు. దీని ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు. కాగా, నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతో గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.