Vijay Sai Reddy: ఈ వ్యాధి నుంచి బయట పడటం అంత తేలిక కాదు: చంద్రబాబుకు విజయసాయి కౌంటర్
- పదవి పోయిన తరువాత చంద్రబాబుకు రుగ్మత
- రిటైర్ మెంట్ సిండ్రోమ్ వచ్చింది
- అందుకే అంతా వ్యతిరేకంగా కనిపిస్తోందన్న విజయసాయి
పదవి పోయిన తరువాత వచ్చిన రుగ్మతతోనే చంద్రబాబునాయుడికి ప్రతిదీ వ్యతిరేకంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ఉంచిన ఆయన రిటైర్ మెంట్ సిండ్రోమ్ కారణంగానే చంద్రబాబుకు ఈ పరిస్థితి తలెత్తిందని సెటైర్లు వేశారు. "చంద్రబాబు, ఆయన శిష్య గణానికి ప్రతిదీ నెగెటివ్‌గా కనిపించడానికి ‘రిటైర్మెంట్ సిండ్రోమ్’ కారణం. పదవులు పోవడం, ప్రజలు పట్టించుకోకపోవడం, మొన్నటి వరకు ఇంద్రుడు, చంద్రుడు అని కీర్తించిన వారంతా అదృశ్యమవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తి ఉంటుంది. బయట పడటం అంత తేలికేమీ కాదు" అని అన్నారు.