kallola biswas: ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిపై కేంద్రం వేటు

  • మూడు నెలల జీతం ఇచ్చి పంపించాలని ఆదేశం
  • ప్రతిభా సమీక్ష అనంతరం నిర్ణయం
  • 1991 బ్యాచ్‌కి చెందిన అధికారి కల్లోల్‌ బిస్వాస్‌

ప్రతిభా సమీక్ష పరీక్షల్లో విఫలమైన ఓ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్‌) అధికారికి మూడు నెలల వేతనం చెల్లించి విధుల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.  బోటనీలో పొస్టుగ్రాడ్యుయేట్ అయిన కల్లోల్‌ బిస్వాస్‌ 1991కి చెందిన ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయనకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ  ప్రతిభా సమీక్ష పరీక్ష నిర్వహించింది. అనంతరం ఆయనను సర్వీస్‌ నుంచి తొలగించాంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సర్క్యులర్‌ పంపింది. కేంద్రం ఆదేశాల మేరకు ఆయనకు మూడు నెలల జీతం చెల్లించి విధుల నుంచి తప్పిస్తారు.  కేంద్ర సర్వీస్ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించాలని, కట్టుతప్పితే ఉపేక్ష్తించేది లేదని బిస్వాస్ పై వేటు వేయడం ద్వారా కేంద్రం హెచ్చరిక జారీ చేసినట్టయ్యింది.

ఏపీకి చెందిన ఒక కేంద్ర ప్రభుత్వ అధికారిపై ఇలా వేటు వేయడం ఇదే మొదటిసారి. బిస్వాస్ అనంతపురంలో పనిచేసినప్పుడు గాలి జనార్దనరెడ్డి వ్యవహారంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం హయాంలో బిస్వాస్ ను చాలా కాలం రిజర్వ్ లో ఉంచారు. ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇవ్వగా ఆయన బాధ్యతలు స్వీకరించి నాలుగు రోజులే అయ్యింది. ఇంతలోనే ఆయనపై వేటు పడింది.


  • Loading...

More Telugu News