Sensex: కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు
- ఏప్రిల్ లో నెమ్మదించిన కీలక రంగాల వృద్ధి
- 462 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 138 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను చవిచూశాయి. ఏప్రిల్ నెలలో కీలకమైన ఉక్కు, ఎరువులు, సిమెంటు, విద్యుత్, సహజవాయువు, బొగ్గు, ముడిచమురు, రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి నెమ్మదించడంతో... మార్కెట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. విదేశీ పెట్టుబడులు తరలిపోతుండం మార్కెట్లను మరింత కుంగదీసింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 462 పాయింట్లు పతనమై 37,018కి పడిపోయింది. నిఫ్టీ 138 పాయింట్లు కోల్పోయి 10,980కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (1.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.45%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%), బజాజ్ ఆటో (0.92%), హీరో మోటో కార్ప్ (0.59%).
టాప్ లూజర్స్:
వేదాంత లిమిటెడ్ (-5.55%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.47%), టాటా మోటార్స్ (-4.50%), భారతీ ఎయిర్ టెల్ (-4.10%), యస్ బ్యాంక్ (-3.18%).