jaya bachan: నిరసన కార్యక్రమంలో నవ్విన జయబచ్చన్.. విరుచుకుపడుతున్న నెటిజన్లు

  • ఉన్నావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ నిరసన
  • పాల్గొన్న ఎస్పీ, టీఎంసీ సభ్యులు
  • ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఉన్నావో అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో రెండు పార్టీల ముఖ్య నేతలతోపాటు బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు అయిన జయబచ్చన్ కూడా పాల్గొన్నారు. అయితే, నిరసన ప్రదర్శన కొనసాగుతుండగా జయాబచ్చన్ తోటి సభ్యులతో నవ్వుతూ మాట్లాడడం తీవ్ర విమర్శలకు కారణమైంది.

ఆమె నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. వాటిని చూసినవారు జయబచ్చన్‌పై మండిపడుతున్నారు. దేశాన్ని కుదిపేస్తున్న ఓ తీవ్రమైన అంశంపై నిరసన తెలుపుతున్న సమయంలో ఈ నవ్వులేంటంటూ మండిపడుతూ ట్రోల్ చేస్తున్నారు. వారి తీరు చూస్తుంటే బాధితురాలికి అండగా నిరసన తెలుపుతున్నట్టు కనిపించడం లేదని, తమ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఈ కార్యక్రమం నిర్వహించినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
jaya bachan
parliament
laught
Social Media

More Telugu News