Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 100 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 17 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతం పైగా లాభపడ్డ భారతి ఎయిర్ టెల్
తీవ్ర ఒడిదుడుకుల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకాలను విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై కొంత ప్రతికూలతను చూపాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 37,118కి పెరిగింది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 10,997 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (6.02%), ఏషియన్ పెయింట్స్ (2.71%), బజాజ్ ఆటో (2.49%), మారుతి సుజుకి (2.12%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.83%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.76%), టాటా స్టీల్ (-2.50%), ఎన్టీపీసీ (-2.05%), ఓఎన్జీసీ (-1.86%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.73%).