Polavaram: ఏపీ ప్రభుత్వ నిర్ణయం పోలవరం ప్రాజెక్ట్ కు కొత్త అవరోధం: కేంద్ర మంత్రి షెకావత్

  • ‘పోలవరం’ టెండర్లు రద్దు బాధాకరం
  • మళ్లీ టెండర్లు పిలిచి ప్రాజెక్టు పూర్తి చేయాలి!
  • ఎంత సమయం పడుతుందో చెప్పలేం

ఏపీలో గత ప్రభుత్వం హయాంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కుదుర్చుకున్న టెండర్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పందించారు. ‘పోలవరం’ టెండర్లు రద్దు చేయడం బాధాకరమైన విషయమని, ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రాజెక్ట్ కు కొత్త అవరోధంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. మళ్లీ టెండర్లు పిలిచి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎంత సమయం పడుతుందో చెప్పలేమని అన్నారు.

  • Loading...

More Telugu News