Maharashtra: ముంబైలో కుండపోత వర్షం.. బస్సుల్లోకి చొచ్చుకొచ్చిన వరదనీరు!
- నీట మునిగిన పలు ప్రాంతాలు
- మళ్లీ హెచ్చరించిన వాతావరణ శాఖ
- రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు పడతాయని ప్రకటన
మహారాష్ట్రలోని ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరుణుడు తన ప్రతాపాన్ని చూపడంతో నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే నీట మునిగాయి. దీనికితోడు రాబోయే 4-5 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను బీఎంసీ అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ముంబైలో వరదల తీవ్రతకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ వర్షానికి వరదనీరు బీఎంసీ బస్సులోకి వచ్చేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.