India: బ్యాట్ కమాండోల శవాలను తీసుకెళ్లొచ్చు, కానీ..!: పాక్ కు భారత్ సూచన
- కశ్మీర్ లో చొరబాట్లకు పాక్ ఉగ్రవాదుల ప్రయత్నం
- ఉగ్రవాదులకు మద్దతుగా కాల్పులు జరిపిన పాక్ బ్యాట్ కమాండోలు
- ఏడుగుర్ని మట్టుబెట్టిన భారత ఆర్మీ
కశ్మీర్ లో ఉగ్రవాదులను ప్రవేశపెట్టేందుకు సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) కమాండోలను భారత సైన్యం నిర్దాక్షిణ్యంగా హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో దాదాపు ఏడుగురు హతమైనట్టు భారత ఆర్మీ వర్గాలు భావిస్తున్నాయి. వీరి శవాలు పీఓకేలో పడి ఉన్నట్టు డ్రోన్ చిత్రాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ బ్యాట్ కమాండోల శవాలను పాక్ తీసుకెళ్లొచ్చని, అయితే, పాక్ సైన్యం తెల్ల జెండాలతో ఘటన స్థలికి రావాల్సి ఉంటుందని భారత సైన్యం స్పష్టం చేసింది. దీనిపై పాక్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. గత రెండ్రోజులుగా కెరాన్ ప్రాంతంలో పాక్ బ్యాట్ కమాండోలు చొరబాట్లకు విశ్వప్రయత్నం చేస్తుండగా, భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.