Jammu And Kashmir: జమ్ము కశ్మీర్ లో పరిస్థితిపై మెహబూబా ముఫ్తీ స్పందన

  • ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్నారు
  • కశ్మీరీలకు భద్రత కల్పించడంలో శ్రద్ధ చూపట్లేదు
  • మానవతావాదం ఎక్కడికిపోయింది?

జమ్ము కశ్మీర్ నెలకొన్న పరిస్థితిపై మాజీ సీఎం, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ స్పందించారు. యాత్రికులు, సందర్శకులు, కార్మికులు, విద్యార్థులు, క్రికెటర్లను ఖాళీ చేయిస్తూ ఉద్దేశపూర్వకంగా భయాందోళనలు సృష్టిస్తున్నారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరీలకు భద్రత, ఊరట కల్పించడంలో శ్రద్ధ చూపడం లేదని, మానవతావాదం ఎక్కడికిపోయిందంటూ ఓ పోస్ట్ లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా, జమ్ముకశ్మీర్ ప్రస్తుత పరిణామాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, గవర్నర్ సత్యపాల్ మాలిక్ పేర్కొన్నారు. వదంతులను నమ్మొద్దని రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News