West Godavari District: గోదావరి జిల్లాల ప్రజలు ఆందోళన చెందొద్దు: ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్
- వరద గుప్పిట్లో నదీ తీరంలోని గ్రామాలు
- జలదిగ్బంధంలో దేవీపట్నం మండలం
- వరద బాధితుల కోసం అన్ని ఏర్పాట్లు చేశాం: ఉపముఖ్యమంత్రి
ఏపీలో కురుస్తున్న వర్షాలతో గోదావరి జిల్లాల్లోని పలు గ్రామాలు జలమయం అయ్యాయి. నదీ తీరంలోని గ్రామాలు ఐదు రోజులుగా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. దేవీపట్నం మండలం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పందిస్తూ, గోదావరి జిల్లాల ప్రజలు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.
తూర్పు గోదావరి జిల్లాలో 5 వేల మందికి, పశ్చిమ గోదావరిలో 8 వేల మందికి వరద సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, రాజమహేంద్రవరం వద్ద గోదావరి నది ప్రవాహ ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద నీరు 14.3 అడుగులకు చేరింది. 13.45 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.