Jammu And Kashmir: రెండు రాష్ట్రాలుగా జమ్ముకశ్మీర్.. కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్?

  • ఆర్టికల్ 370, 35-Aలకు చరమగీతం
  • నేడు పార్లమెంటుకు రాష్ట్రాన్ని విడగొట్టే బిల్లు
  • ఘంటాపథంగా చెబుతున్న విశ్లేషకులు

జమ్ముకశ్మీర్‌ మూడు ముక్కలు కాబోతుందా? గత కొన్ని రోజులుగా కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జమ్ము, కశ్మీర్‌లుగా రాష్ట్రాన్ని రెండు వేర్వేరు రాష్ట్రాలుగా విడగొట్టి లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని కేంద్రం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నేడు జరగనున్న కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఆ వెంటనే అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. ప్రభుత్వ నిర్ణయం అమలైతే కశ్మీర్‌కు ఇప్పటి వరకు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్‌ 370, 35-Aలు కాలగర్భంలో కలిసిపోతాయి.    
 
నిజానికి గత నెల 26తోనే పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉండగా వాటిని ఈ నెల ఏడో తరగతి వరకు పొడిగించడం, చరిత్రలో తొలిసారిగా అమర్‌నాథ్ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయడం, జమ్ముకశ్మీర్‌లో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించడం, ఇంటర్నెట్ సేవలు బంద్ చేయడం వంటి పరిణామాలన్నీ ఇందులో భాగమేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, జమ్ముకశ్మీర్‌ను మూడు ముక్కలు చేసే బిల్లుకు నేడే ఆమోద ముద్ర కూడా పడుతుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News