Pakistan: అవతలి వ్యక్తులను బుట్టలో పడేసే నైపుణ్యం ఉన్న అమ్మాయిలు కావాలి.. పాక్ మిలటరీ మీడియా సంస్థ ప్రకటన!

  • దరఖాస్తుదారులకు సోషల్ మీడియాపై మంచి పట్టుండాలి
  • ఇంగ్లిష్‌ మాట్లాడడంలో నైపుణ్యం అవసరం
  • సానుకూల దృక్పథం.. ఓపిక అదనపు ఆకర్షణలు
సాధారణంగా ఏదైనా సంస్థ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు విద్యార్హతలు, నైపుణ్యం వంటి వాటిని ప్రధాన అర్హతలుగా చూస్తారు. కానీ పాకిస్థాన్ మిలటరీకి చెందిన మీడియా సంస్థ విడుదల చేసిన నోటిఫికేషన్ ఇందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ నోటిఫికేషన్ ప్రకారం.. సోషల్ మీడియాను విపరీతంగా ఉపయోగిస్తూ, దానిపై మంచి పట్టున్న యువతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

దరఖాస్తుదారులకు సోషల్ మీడియాను వినియోగించడంలో మంచి పట్టుండాలి. ఇంగ్లిష్ చక్కగా మాట్లాడుతూ అవతలి వ్యక్తులను బుట్టలో పడేసే నేర్పు ఉండాలి. సానుకూల దృక్పథం, ఓపిక అదనపు ఆకర్షణలు. పాకిస్థాన్‌లోని ఫాతిమా  జిన్నా మహిళా యూనివర్సిటీ ఈ ప్రకటనను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా, ఈ ప్రకటన చూస్తుంటే ఇలా తీసుకోబోయే అమ్మాయిలను ఇండియన్ ఆర్మీపై ‘హనీట్రాప్’ కోసం వినియోగించే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  
Pakistan
military
Social Media
girls
Honeytrap

More Telugu News