Rajya Sabha: రాజ్యసభకు జమ్మూ కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లు!
- ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ
- విపక్షాల నిరసనల మధ్యే సభలో బిల్లు
- చర్చించేందుకు సమయం ఇస్తానన్న వెంకయ్య
విపక్షాల నిరసనల మధ్య కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రాజ్యసభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా, జమ్మూ కశ్మీర్ లో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని, అక్కడ ఓ రకమైన యుద్ధ వాతావరణం నెలకొందని, ముందుగా ఆ అంశంపైనే చర్చించాలని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ సహా పలువురు పట్టుబట్టారు.
అయితే, ఏ అంశాన్నైనా సభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చించే వేళ ప్రస్తావించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు రూలింగ్ ఇచ్చారు. ఆపై అమిత్ షా, బిల్లును ప్రవేశపెడుతున్న వేళ విపక్ష నేతలు నినాదాలతో హోరెత్తించారు. కనీసం బిల్లును చదివేందుకైనా సమయం ఇవ్వాలని పలువురు కోరినప్పటికీ, చైర్మన్ అంగీకరించలేదు.