Rajya Sabha: బ్రేకింగ్... ఆర్టికల్ 370 రద్దుకు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా ... రాజ్యసభ లైవ్ నిలిపివేత!
- బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- రాజ్యసభ లైవ్ ప్రసారాల నిలిపివేత
గత కొన్ని రోజులుగా ఊహిస్తున్నట్టుగానే, రాజ్యసభలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తూ, రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్టు అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర నిరసనలు తెలుపుతున్న వేళ, అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టగా, దీనిపై చర్చ చేపడతామని చైర్మన్ వెంకయ్యనాయుడు వెల్లడించారు. ఆ సమయంలో కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకువచ్చి నినాదాలతో హోరెత్తించారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను నిలిపివేశారు. ఆర్టికల్ 370 రద్దును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని విపక్షాలు స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే.