Article 370: ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: కమలహాసన్

  • ఆర్టికల్ 370 రద్దుని విమర్శించిన కమల్ 
  • ఇదొక తిరోగమన, నిరంకుశ చర్య
  • ఆర్టికల్ 370 పుట్టుకకు ఒక నిర్దిష్టమైన కారణం ఉంది

జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంపై ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీధి మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. ఇది తిరోగమన, నిరంకుశ చర్య అని విమర్శించారు. ఆర్టికల్ 370, 35A పుట్టుకకు ఒక నిర్దిష్టమైన కారణం ఉందని అన్నారు. పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాతే వీటిలో ఏవైనా మార్పులు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. బలవంతంగా ప్రతిపక్షాల నోళ్లు మూయించారని దుయ్యబట్టారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News