Sensex: బ్యాంకింగ్, ఆటో స్టాకుల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 277 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 86 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 5 శాతం పైగా లాభపడ్డ యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో స్టాకుల అండతో లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్లు లాభపడి 36,977కి పెరిగింది. నిఫ్టీ 86 పాయింట్లు ఎగబాకి 10,948 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.30%), టెక్ మహీంద్రా (3.97%), బజాజ్ ఫైనాన్స్ (3.41%), భారతి ఎయిర్ టెల్ (3.18%), ఏసియన్ పెయింట్స్ (2.74%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.52%), టీసీఎస్ (-1.47%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.31%), టాటా మోటార్స్ (-0.97%), బజాజ్ ఆటో (-0.77%).