ISRO: మరో కీలక ఘట్టం పూర్తిచేసిన చంద్రయాన్-2

  • ఐదో దశ విజయవంతం
  • భూకక్ష్యను దాటే క్రమంలో పురోగతి
  • ఈ నెల 14న ఆరోదశ

చంద్రుడి గుట్టు విప్పేందుకు ఇస్రో సంధించిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ లక్ష్యం దిశగా సాగుతోంది. ఈ క్రమంలో భూకక్ష్యను అధిగమించే క్రమంలో ఐదో దశను విజయవంతంగా పూర్తి చేసింది. తద్వారా చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఈ ప్రక్రియ కోసం స్పేస్ క్రాఫ్టులోని ప్రొపల్షన్ వ్యవస్థను 1041 సెకన్ల పాటు మండించారు. దాంతో, స్పేస్ క్రాఫ్టు నిర్దేశిత 276×142975 కి.మీ కక్ష్యలో అడుగుపెట్టింది. తదుపరి ప్రక్రియలో భాగంగా చంద్రయాన్-2 ఈ నెల 14న భూకక్ష్యను దాటి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది.

  • Loading...

More Telugu News