Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం
- ఈ బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు
- వ్యతిరేకంగా 70 ఓట్లు
- బీజేపీ సభ్యుల హర్షం
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుతో లోక్ సభ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 370 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు లభించాయి. అంతకుముందు,
ఆర్టికల్ 370 రద్దు బిల్లుకు నిర్వహించిన ఓటింగ్ లో అనుకూలంగా 351 మంది, వ్యతిరేకంగా 72 మంది ఓట్లు వేశారు. ఈ బిల్లుల ఆమోదానికి ముందు హోం మంత్రి అమిత్ షా సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ బిల్లులకు ఆమోదం లభించడంపై బీజేపీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
కాగా, జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు నిన్న రాజ్యసభలో ఆమోదం లభించింది. దీంతో, ఉభయసభల్లో ఈ బిల్లుకు ఆమోదం లభించినట్టయింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర పడాల్సి ఉంది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది.