Sensex: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- జీడీపీ వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన ఆర్బీఐ
- 286 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 92 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు అంచనాలను 7 శాతం నుంచి 6.9 శాతానికి ఆర్బీఐ తగ్గించడం మార్కెట్లపై ప్రభావాన్ని చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 36,690కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు పతనమై 10,855కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (1.95%), యస్ బ్యాంక్ (1.70%), హీరో మోటో కార్ప్ (1.54%), సన్ ఫార్మా (0.80%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.72%).
టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-5.62%), టాటా స్టీల్ (-4.75%), టాటా మోటార్స్ (-4.20%), వేదాంత లిమిటెడ్ (-3.02%), యాక్సిస్ బ్యాంక్ (-2.77%).