India: భారత్ తో ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని పాక్ నిర్ణయం!

  • పాక్ ప్రధాని అధ్యక్షతన ఆ దేశ ఎన్ఎస్సీతో భేటీ
  • భారత్ తో దౌత్య సంబంధాలు తగ్గించాలని నిర్ణయం
  • ద్వైపాక్షిక ఒప్పందాలపై పున:సమీక్ష ప్రస్తావన

జమ్ముకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేయడం మన పొరుగు దేశం పాకిస్థాన్ కు మింగుడుపడటం లేదు. ఈ విషయమై పాకిస్థాన్ ఇప్పటికే పలు విమర్శలు చేయడం ఇందుకు నిదర్శనం. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ (ఎన్ఎస్సీ) ఈరోజు భేటీ అయింది. భారత్ తో దౌత్య సంబంధాలు తగ్గించాలని, ద్వైపాక్షిక వాణిజ్యం నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అదే విధంగా, భారత్- పాక్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలపై పున: సమీక్షించాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.

@
  • Loading...

More Telugu News