Jammu And Kashmir: ఆర్టికల్ 370కి చెల్లుచీటీ.. రద్దు అయినట్టు ప్రకటించిన రాష్ట్రపతి
- మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్
- ఆర్టికల్ 370కి సంబంధించిన అన్ని నిబంధనలు శాశ్వతంగా రద్దు
- మార్పులు, మినహాయింపు లేని అన్ని నిబంధనలు కశ్మీర్‌కు వర్తింపు
ఆర్టికల్ 370 రద్దుపై భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సంతకం చేశారు. దీంతో ఇకపై ఈ అధికరణకు సంబంధించిన అన్ని నిబంధనలు శాశ్వతంగా రద్దు అయినట్టే. ఇప్పటి నుంచి ఈ నిబంధన చెల్లుబాటులో ఉండదని మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 నిబంధన 3(రెడ్‌విత్ క్లాజ్ 3) ద్వారా రాష్ట్రపతికి సమకూరిన అధికారాల మేరకు పార్లమెంటు సిఫారసుతో ఆగస్టు ఆరు నుంచే ఈ ఆర్టికల్ రద్దు అయినట్టు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రపతి సంతకంతో కూడిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఆర్టికల్ 370లో సవరణలు చేసినవి, ఎలాంటి మార్పులు, మినహాయింపులు లేని అన్ని రాజ్యాంగ నిబంధనలు జమ్ముకశ్మీర్‌కు వస్తాయని ఆ నిబంధనలో పేర్కొన్నారు.