Abhinandan: అభినందన్ కు 'వీర్ చక్ర' పురస్కారం?

  • భారత వాయుసేన సత్తాను చాటిన అభినందన్
  • పాక్ చెరలో ఉన్నప్పటికీ అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించిన వైనం
  • అభినందన్ ను సముచిత రీతిలో గౌరవించనున్న భారత ప్రభుత్వం

పాకిస్థాన్ యుద్ధ విమానాన్ని కూల్చి భారత వాయుసేన సత్తాను ప్రపంచానికి చాటిన వింగ్ కమాండర్ అభినందన్ ను భారత ప్రభుత్వం సుముచిత రీతిలో గౌరవించనుంది. పాక్ సైన్యం చెరలో ఉన్నప్పుడు కూడా మొక్కవోని ధైర్యసాహసాలను ప్రదర్శించిన ఆయనకు 'వీర్ చక్ర' పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు తెలుస్తోంది. సైన్యానికి సంబంధించి పరమ్ వీర్ చక్ర, మహా వీర్ చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం.

పాక్ సైన్యం చేతిలో బందీగా ఉన్న సమయంలో కూడా అభినందన్ ఏ మాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. పాక్ సైన్యం ఎంత బలవంతం చేసినా, మన మిలిటరీకి సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టలేదు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అభినందన్ ధైర్యసాహసాలకు, దేశ భక్తికి యావత్ దేశం మురిసిపోయింది.

  • Loading...

More Telugu News