Subrahmanya Swamy: అయోధ్యపై సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చినా... మావద్ద ఓ బ్రహ్మాస్త్రం ఉంది: సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్య
- రాజ్యాంగంలో ఆర్టికల్ 300 A
- ఎవరు గెలిచినా పరిహారం ఇచ్చి భూమి స్వాధీనం
- మొత్తం భూమిలో వివాదం 0.313 ఎకరాలపైనే
- ట్విట్టర్ లో సుబ్రహ్మణ్యస్వామి
అయోధ్యలో రామమందిరం నిర్మించేది ఖాయమని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పినా, తమ వద్ద ఓ బ్రహ్మాస్త్రముందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. "అయోధ్య దేవాలయం విషయంలో సుప్రీంకోర్టు ఏం చేసినా, ప్రభుత్వం వద్ద రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కింద ఓ బ్రహ్మాస్త్రం ఉంది. దీని ప్రకారం, ఈ కేసులో విజేతకు భూమిని ఇవ్వకుండా నష్టపరిహారం చెల్లించి, మొత్తం అయోధ్యలోని 67.703 ఎకరాలనూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. ఈ భూమిలో వివాదాస్పదమైన 0.313 ఎకరాల స్థలంపైనే సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది" అని అన్నారు.