Articlr 370: ఆర్టికల్ 370 రద్దుపై అత్యవసర విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు
- ఆర్టికల్ 370 రద్దు చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్
- పిటిషన్ దాఖలు చేసిన అడ్వొకేట్ ఎంఎల్ శర్మ
- సరైన సమయంలో పిటిషన్ ను విచారిస్తామన్న సుప్రీంకోర్టు
జమ్ముకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చట్ట విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో అడ్వొకేట్ ఎంఎల్ శర్మ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సరైన సమయంలో దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. ఆర్టికల్ 370ని రద్దు చేసే తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్యసభలో ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు అది రాజ్యసభ ఆమోదం పొందింది. మరుసటి రోజు లోక్ సభ కూడా ఆమోదించింది. అదే రోజు రాత్రి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడిపోయింది.