Bharataratna: భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
- ఈ ఏడాది ముగ్గురికి భారతరత్న పురస్కారాలు
- రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం
- అవార్డు అందుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత్ లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ ఏడాది భారతరత్న అవార్డులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ సంగీత దర్శకుడు భూపేన్ హజారికా, సంఘ సంస్కర్త నానాజీ దేశ్ ముఖ్ లను వరించింది. హజారికా, దేశ్ ముఖ్ లకు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు. కాగా, ఈ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ ప్రథమపౌరుడు రామ్ నాథ్ కోవింద్ భారతరత్న పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇక, హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్, నానాజీ దేశ్ ముఖ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డు స్వీకరించారు.