mahabubnagar district: ఒకేసారి 88 మందిపై సస్పెన్షన్ వేటు: ఉద్యోగులకు షాకిచ్చిన మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్
- నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించిన సిబ్బంది
- 64 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 24 మంది కార్యదర్శులపై వేటు
- హరితహారం సమావేశానికి హాజరై మధ్యలోనే వెళ్లడంతో ఆగ్రహం
ఉద్యోగులకు ఊహించని షాక్...ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆటవిడుపులా భావించినందుకు శిక్ష...కలెక్టర్ ఆగ్రహిస్తే చర్యలు ఎంత తీవ్రంగా ఉంటాయనేందుకు ఉదాహరణ... మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రభుత్వ సూచనల మేరకు హరితహారం, జలశక్తి అభియాన్ సమావేశాన్ని కలెక్టర్ నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన 64 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 24 మంది పంచాయతీ కార్యదర్శులు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. దీన్ని గమనించిన జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ వారికి షాకిచ్చారు. మొత్తం 88 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం బాధితులకు షాకివ్వగా జిల్లా ఉద్యోగ వర్గాల్లో సంచలనమైంది.