Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ‘రేషన్’ వినియోగదారులకు శుభవార్త..‘వన్ నేషన్- వన్ రేషన్’ ప్రారంభం
- కేంద్ర మంత్రి పాశ్వాన్ ఆన్ లైన్ ద్వారా ప్రారంభించారు.
- హైదరాబాదులో కార్యక్రమం ప్రారంభం
- ఇకపై తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు: అకున్ సబర్వాల్
తెలుగు రాష్ట్రాల్లోని రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఇకపై రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చు. తెలంగాణలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ కొత్త కార్డు విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆన్ లైన్ ద్వారా దీనిని ప్రారంభించారు. హైదరాబాద్ లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ‘వన్ నేషన్ - వన్ రేషన్’ కార్డు విధానం అమలు చేస్తున్నట్టు చెప్పారు. నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ-ఏపీ క్లస్టర్ ద్వారా రెండు రాష్ట్రాల్లో సేవలందుతాయని, ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని చెప్పారు.