Apsrtc: ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. ఆర్టీసీ రాయితీ బస్ పాస్ పరిధి పెంపు!
- బస్ పాస్ పరిధిని 35 నుంచి 50 కిలో మీటర్లకు పెంపు
- ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
- ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధి పొందనున్న విద్యార్థులు
ఏపీలో విద్యార్థులకు శుభవార్త. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బస్ పాస్ పరిధిని 35 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రాయితీ బస్ పాస్ పరిధి పెంపు కారణంగా ప్రభుత్వంపై ఏటా రూ.18.5 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా.
కాగా. ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు దూరంగా ఉన్నాయి. దీంతో, ఆటోలు, ప్రైవేట్ వాహనాలను విద్యార్థులు ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సూచనల మేరకు రాయితీ బస్ పాస్ ల పరిధిని పెంచుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.