Khammam District: భద్రాచలం రాములోరి సన్నిధిలోకి వరద నీరు : అరిష్టం అంటున్న భక్తులు

  • ఆలయంతోపాటు అన్నదాన సత్రంలోకి నీరు ప్రవేశం
  • స్థానిక నివాసితుల్లో ఆందోళన
  • సాంకేతిక సమస్య వల్లే అని అధికారుల వివరణ

త్రేతాయుగంలో అరణ్యవాసం సమయాన రాముడు నడయాడిన ప్రాంతంగా భావించే భద్రాచలంలోని రామాలయంలోకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో భక్తులతోపాటు స్థానిక నివాసితులు ఆందోళన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో రాములోరి ఆలయం ఉంది.  ఆలయంతోపాటు అన్నదాన సత్రంలోకి వరద నీరు చేరడంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇలా జరగడంతో ఇది అరిష్టమని ఆధ్యాత్మిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గత కొన్ని రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నీరు ఆలయంలోకి కూడా చేరడంతో ఆందోళన మొదలయ్యింది. అయితే ఇది యాధృచ్చికంగా జరిగిందని, భయపడాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. విస్తా కాంప్లెక్స్‌ వద్ద నీటిని మోటార్లతో తోడుతున్న సమయంలో మోటార్ల ఫుట్‌బాల్‌లోకి ప్లాస్టిక్‌ కవర్లు చేరడంతో సాంకేతిక సమస్య తలెత్తి బ్యాక్‌ వాటర్‌ ఆలయంలోకి, సత్రంలోకి చేరిందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చారు.

  • Loading...

More Telugu News