Nara Lokesh: జగన్‌గారూ... పెట్టుబడులు అడిగే తీరు ఇదేనా?: లోకేశ్ ఎద్దేవా

  • ఓట్లు, సీట్లు చెబితే పరిశ్రమలు వస్తాయా
  • వనరులు, సదుపాయాల గురించి వివరించాలి
  • వచ్చిన వారిలో నమ్మకం కలిగించకుండా సొంత డబ్బా ఎందుకు

విజయవాడ కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన తొలి పెట్టుబడుల సదస్సులో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన తీరును మాజీ మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. విదేశీ పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు స్థాపించాలన్నా సాధించిన ఓట్లు, సీట్లు చెప్పి సొంత డబ్బా కొట్టుకుంటారా? అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ఉన్న వనరులు ఏమిటి? పెట్టుబడులు పెట్టేవారికి ఎటువంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది? వచ్చిన వారికి ఎటువంటి ప్రగతి లభిస్తుంది? వంటి అంశాలు వివరించకుండా వైసీపీ ప్రభుత్వం సొంత భజన చేసుకుని వచ్చిన వారికి నిరాశ మిగిల్చిందన్నారు. గత ప్రభుత్వం ఈజ్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్వారా సాధించిన 700 అవార్డులు, ప్రగతి గురించి చెప్పలేక తమది పేద రాష్ట్రమని జగన్‌ చెప్పడం సిగ్గుచేటన్నారు.

  • Loading...

More Telugu News