Andhra Pradesh: మొదట మండలానికి ఓ పాఠశాలను ఆధునికీకరిస్తాం: విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
- సీఎం జగన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సమీక్ష
- హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
- త్వరలోనే ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని వెల్లడి
ఏపీ సీఎం జగన్ ఇవాళ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా పాల్గొన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారని వెల్లడించారు. మొదట మండలానికి ఓ పాఠశాలను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర స్కూళ్లను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక, స్కూళ్లలో టీచర్ల సంఖ్య గురించి చెబుతూ, విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా టీచర్ల నియామకం ఉంటుందని వివరించారు. త్వరలోనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి వెల్లడించారు.