Andhra Pradesh: అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి: ఏపీ సీఎం జగన్
- త్యాగం, సహనం ‘బక్రీద్’ ఇచ్చే సందేశాలు
- దైవ ప్రవక్త త్యాగాన్ని స్మరించుకుంటారు
- బక్రీద్ శుభాకాంక్షలు
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రజలకు ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘త్యాగం, సహనం బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలు’ అని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లింలు బక్రీద్ పండగను జరుపుకుంటారని, అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, బక్రీద్ పండగను ‘ఈద్ అల్ అద్హా’ అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండగ ‘ఖుద్బా’ అనే ధార్మిక ప్రసంగం ద్వారా ప్రారంభిస్తారు. సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ‘ఖుర్బానీ’ పేరిట జంతువులను బలిస్తారు. ‘ఖుర్బానీ’ అంటే బలిదానం ఇవ్వడం, త్యాగం అనే అర్థాలు ఉన్నాయి.