Triple Talak: మోదీ కోసం ప్రత్యేక రాఖీలు తయారు చేస్తున్న ముస్లిం మహిళలు
- ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసిన మోదీ సర్కార్
- ఆనందంలో ముస్లిం మహిళలు
- ఆగస్టు 15 సందర్భంగా మోదీకి ప్రత్యేక రాఖీలు పంపాలని నిర్ణయం
ట్రిపుల్ తలాఖ్ కారణంగా ముస్లిం మహిళలు ఇంతకాలం ఎన్నో ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వారి హక్కులను కాపాడేందుకు, వారికి సరైన జీవితాన్ని అందించేందుకు మోదీ సర్కారు ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసింది. కొత్త చట్టం ప్రకారం ఏక కాలంలో భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పే భర్తలను జైలుకు పంపుతారు. మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయంతో ముస్లిం మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. తమ సంరక్షణ కోసం పాటుపడిన మోదీకి వినూత్నంగా ధన్యవాదాలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా మోదీకి ప్రత్యేక రాఖీలు పంపాలని నిర్ణయించారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ముస్లిం మహిళలు ప్రత్యేక రాఖీలను తయారు చేశారు. వీటిని ప్రధానికి పంపనున్నారు.