Sensex: రిలయన్స్ దెబ్బకు కుదేలైన ఇతర టెలికాం షేర్లు.. కుప్పకూలిన మార్కెట్లు
- 623 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 183 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 10 శాతం వరకు లాభపడ్డ రిలయన్స్ ఇండస్ట్రీస్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా పతనమయ్యాయి. అమెరికా, యూరప్ మార్కెట్ల ఈక్విటీ ఫ్యూచర్లు పడిపోవడం, హాంకాంగ్ లో దిగజారిన పరిస్థితులు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఫైబర్ నెట్ సేవలను తీసుకొస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించడంతో... ఇతర టెలికాం షేర్లు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 623 పాయింట్లు పతనమై 36,958కి దిగజారింది. నిఫ్టీ 183 పాయింట్లు కోల్పోయి 10,925కి పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ ఇండస్ట్రీస్ (9.72%), సన్ ఫార్మా (3.71%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.05%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-10.35%), మహీంద్రా అండ్ మహీంద్రా (-6.11%), బజాజ్ ఫైనాన్స్ (-5.72%) భారతి ఎయిర్ టెల్ (-5.28%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-5.07%).