Sandlewood: భార్యతో కన్నడ స్టార్ హీరో దర్శన్ గొడవలు!

  • గతంలో గొడవలు పడిన దర్శన్, విజయలక్ష్మి
  • ఆపై సర్దుకున్నా మరోమారు విభేదాలు
  • ట్విట్టర్ లో పరస్పరం అన్ ఫాలో
గతంలో ఓ మారు గొడవలు పడి, తిరిగి సర్దుకుని కాపురం చేసుకుంటున్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్, అయన భార్య విజయలక్ష్మి మధ్య మళ్లీ గొడవలు మొదలైనట్టు సమాచారం. సోమవారం నాడు ట్విట్టర్‌ లో ఈ జంట పరస్పరం అన్‌ ఫాలో అయ్యింది. ఇదే సమయంలో విజయలక్ష్మి దర్శన్‌ పేరుతో ఉన్న ట్విట్టర్‌ ఖాతా నుంచి దర్శన్‌ పదాన్ని విజయలక్ష్మి తొలగించారు. దీంతో ఇద్దరి మధ్యా మరోమారు వివాదాలు మొదలయ్యాయన్న ప్రచారం ప్రారంభమైంది.

ఇప్పటికే ఇద్దరూ వేరువేరుగా నివాసం ఉంటుండగా, ఇటీవల విడుదలైన 'యజమాన' సినిమా మేకింగ్‌ వీడియోలో కలిసి కనిపించారు. దీంతో గొడవలు సద్దుమణిగాయని భావించేలోపే తాజా పరిణామాలు సంభవించాయి. ఇక తమ మధ్య గొడవలేమీ లేవని విజయలక్ష్మి తన ట్విట్టర్ ఖాతాలో వివరణ ఇచ్చినా, ఏదో జరుగుతోందన్న ప్రచారం మాత్రం ఆగడం లేదు. వీరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓ సీనియర్ నటుడు, మరో రాజకీయ నాయకుడు  ప్రయత్నిస్తున్నట్లు  సమాచారం.
Sandlewood
Darshan
Vijayalakshmi
Twitter

More Telugu News