moon: భూకక్ష్యను దాటిన చంద్రయాన్-2.. చంద్రుడివైపు పరుగులు
- గత నెల 22న చంద్రయాన్-2 ప్రయోగం
- ఈ ఉదయం కీలక ప్రక్రియను చేపట్టిన ఇస్రో
- ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం
భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 ఉపగ్రహం ఈ తెల్లవారుజామున భూకక్ష్యను విడిచిపెట్టింది. మరో వారం రోజుల్లో చంద్రుడి కక్ష్యలో ప్రవేశించనుంది. ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ ద్వారా వ్యోమనౌక భూ కక్ష్యను పూర్తిగా విడిచిపెట్టింది. మరో ఆరు రోజుల్లో ఇది చంద్రుడి కక్ష్యను చేరుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి గత నెల 22న చంద్రయాన్-2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టారు. ఈ నెల 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనున్న వ్యోమనౌక వచ్చే నెల 7న చంద్రుడిపై కాలు మోపనుంది. భూ కక్ష్యను దాటించేందుకు ఈ ఉదయం ఇస్రో చేపట్టిన కీలక ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందంలో మునిగిపోయారు.