Andhra Pradesh: జగన్ గారూ.. ఇప్పుడు మీ కడుపు మంట చల్లారిందా?: నారా లోకేశ్ ఆగ్రహం
- మీ మనుషులతో కేసులు వేయించారు
- ఎత్తిపోతల పథకాలను ఎన్జీటీ ఆపేసింది
- ఏపీ సీఎంపై మండిపడ్డ టీడీపీ నేత
ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉండగా తన మనుషుల చేత కేసులు వేయించి గోదావరి - పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ప్రాజెక్టులు ఆపించారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఈ చర్యలతో రైతుల నోటిలో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ చేసిన పాపం ఇప్పుడు ఎదురుతన్నిందని దుయ్యబట్టారు.
ఇప్పుడు గోదావరి - పెన్నా, పురుషోత్తపట్నం, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టులను ఆపేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) ఆదేశాలు జారీచేసిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చి, నిర్మాణం పూర్తిచేసి రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు చేసిన పాపాలను కడుక్కోవాలని సూచించారు.