Kerala: కేరళలో వరుణుడి ప్రతాపం.. 102 మంది దుర్మరణం!
- మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
- 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
- బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించిన సీఎం విజయన్
కేరళ రాష్ట్రంపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో ఇప్పటివరకూ కేరళలో 102 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కన్నూరు, కోజీకోడ్, మలప్పురం జిల్లాలకు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీచేసింది.
మరోవైపు వరద ఉద్ధృతి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం 11 జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించింది. వరదల్లో ఇళ్లు, భూములు దెబ్బతిన్నవారికి రూ.10 లక్షలు, ఇళ్లు దెబ్బతిన్నవారికి రూ.4 లక్షలు ఇస్తామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు.