Sensex: మెటల్, ఎనర్జీ, బ్యాంకింగ్ షేర్ల అండగో నష్టాల నుంచి బయటపడ్డ మార్కెట్లు
- 353 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 104 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 4 శాతం పైగా లాభపడ్డ వేదాంత లిమిటెడ్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. నిన్న సెన్సెక్స్ 623 పాయింట్లు పతనమైన సంగతి తెలిసిందే. అయితే మెటల్స్, ఎనర్జీ, బ్యాంకింగ్ షేర్ల అండతో ఈరోజు మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 353 పాయింట్లు లాభపడి 37,312కి పెరిగింది. నిఫ్టీ 104 పాయింట్లు పుంజుకుని 11,029 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (4.87%), టాటా స్టీల్ (4.61%), యస్ బ్యాంక్ (4.01%), టెక్ మహీంద్రా (2.76%), హీరో మోటో కార్ప్ (2.65%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-4.69%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.27%), ఓఎన్జీసీ (-1.21%), టాటా మోటార్స్ (-0.94%), ఏసియన్ పెయింట్స్ (-0.30%).