westindies: చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు
- మూడు వన్డేల సిరీస్ లో ఒకటి మ్యాచ్ రద్దు
- రెండో మ్యాచ్ లో విజయం సాధించిన కోహ్లీ సేన
- ఈ మ్యాచ్ లో విజయం కోసం విండీస్ ప్రయత్నం
వెస్టిండీస్-భారత్ జట్ల మధ్య మూడు వన్డేల్లో భాగంగా చివరి మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. రెండో వన్డేలో కోహ్లీ సేన విజయం సాధించింది. దీంతో, ఈ మ్యాచ్ లో కూడా విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తుండగా, కనీసం ఈ మ్యాచ్ లో అయినా గెలిచి సిరీస్ ను సమం చేయాలని విండీస్ చూస్తోంది.