Karnataka: కుటుంబ సభ్యులు నలుగురిని కాల్చి చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న యువకుడు

  • ఆర్థిక సమస్యలే కారణమై ఉండవచ్చన్న అనుమానం
  • ఘటనా స్థలిలో లభించని ఎటువంటి ఆధారాలు
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంలోని నలుగురు వ్యక్తులను కాల్చిచంపి, తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ దారుణానికి కారణంగా భావిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు...మైసూరుకు చెందిన ఓంకార్‌ ప్రసాద్‌ (33), తల్లిదండ్రులు నాగరాజ్‌ భట్టాచార్య (60), హేమలత (54), భార్య నికిత ( 27), కుమారుడు కృష్ణ (5)లతో కలిసి ఉంటున్నాడు. ఓంకార్‌ కొద్దిరోజుల క్రితం మైసూరు వదిలి కుటుంబ సభ్యులతో బందిపొరాలోని యేచెట్టి గ్రామంలో ఉండే ఫామ్‌ హౌస్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట సమీపంలోని నంది హోటల్‌కు మూడు రోజుల క్రితం వచ్చాడు. కుటుంబ సభ్యులంతా అక్కడే ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో కారు డ్రైవర్‌కు ఎటువంటి అనుమానం రాకూడదని ముందుగా అతన్ని వేరే పనిపై బయటకు పంపించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గుండ్లుపేట పట్టణానికి కిలోమీటరు దూరంలో ఉన్న శివారు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కుటుంబ సభ్యులను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే మృతుల వద్ద ఎటువంటి లేఖ లభించక పోవడంతో ఈ ఘోరానికి కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనా స్థలిని సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Karnataka
mysore
Crime News
mand killed family members
suicide

More Telugu News