Eluru: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి దీటుగా తీర్చిదిద్దాలి: మంత్రి ఆళ్ల నాని

  • ఆసుపత్రి సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదు
  • రోగుల ఫిర్యాదుపై దృష్టి సారించాలి
  • ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో సమీక్షించిన నాని

ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆస్పత్రికి దీటుగా తీర్చిదిద్దాలని ఏపీ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులతో ఈరోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ, ఆసుపత్రిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలను అందించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని సూచించారు. ఆసుపత్రి సిబ్బందిపై ఫిర్యాదులు వస్తే సహించేది లేదని హెచ్చరించారు. రోగుల ఫిర్యాదుపై దృష్టి సారించి, సమస్యలు పరిష్కరించాలని, ఆసుపత్రిలో అవినీతి జరుగుతోందంటూ పలు కథనాలు వెలువడ్డాయని, ఆయా ఘటనల్లో సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

  • Loading...

More Telugu News