Team India: టీమిండియా కోచ్ గా మరోమారు ఎంపికైన రవిశాస్త్రి
- టీమిండియా కోచ్ రేసులో బరిలో నిలిచిన ఆరుగురు
- రవిశాస్త్రిని ఎంపిక చేసిన కపిల్ దేవ్ నేతృత్వంలోని కమిటీ
- భారత ఆటగాళ్లపై రవిశాస్త్రికి పూర్తి అవగాహన ఉందన్న కపిల్
టీమిండియా కోచ్ గా రవిశాస్త్రికి మరో అవకాశం లభించింది. కపిల్ దేవ్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ రవిశాస్త్రిని ఎంపిక చేసింది. భారత ఆటగాళ్లపై రవిశాస్త్రికి సంపూర్ణ అవగాహన ఉందని, అన్ని అంశాలపై పూర్తి అవగాహనతో ఆయన పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. కాగా, టీమిండియా కోచ్ రేసులో ఆరుగురు బరిలో నిలిచారు. ఎంపికకు ముందు నుంచే రవిశాస్త్రి వైపే కమిటీ సభ్యుడు అన్షుమన్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ మొగ్గుచూపారు.
2017 జులై 13 నుంచి టీమిండియా కోచ్ గా రవిశాస్త్రి వ్యవహరిస్తున్నాడు. ప్లేయర్ల నిర్ణయాలను గౌరవిస్తూ కోచ్ గా ఆయన విజయవంతమయ్యారు. రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాక శ్రీలంకలో మూడు టెస్టుల సిరీస్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వన్డే సిరీస్, 2018లో దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది.