polavaram: రివర్స్ టెండరింగ్ కు మార్గదర్శకాల విడుదల
- రేపటి నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ
- చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు మార్గదర్శకాలు
- ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ పై మార్గదర్శకాలు
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రేపటి నుంచి రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు మంత్రి అనిల్ కుమార్ ఈరోజు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. జులైన 22న నిర్వహించిన చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ఈ మార్గదర్శకాలను రూపొందించారు. ప్రస్తుత ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్, కొత్త ప్రాజెక్టుల్లో టెండరింగ్ పై ఈ మార్గదర్శకాలు ఉన్నాయి. మొత్తం 29 అంశాలను రివర్స్ టెండరింగ్ మార్గదర్శకాలుగా ప్రభుత్వం నిర్దేశించింది.
- ప్రాజెక్టు కాంట్రాక్టు ఒప్పందాలపై న్యాయ సమీక్ష తర్వాతే రివర్స్ టెండరింగ్ కార్యాచరణ జరపాలి
- ప్రాథమిక అంచనా విలువతో సదరు ప్రాజెక్టు మిగిలిన పనులకు ఈ-టెండరింగ్ కు ప్రభుత్వం వెళ్లాలి
- ఈ-టెండరింగ్ లో పాల్గొనే కాంట్రాక్టు సంస్థ ఏపీలో నమోదు కావాలన్న నిబంధన సడలింపు
- ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనేలా జాయింట్ వెంచర్లను ప్రోత్సహించాలి
- భాగస్వామ్య ఒప్పందాలను కూడా ప్రోత్సహించాలి
- సరైన బిడ్డర్ రాకపోతే కనుక మిగతా పనులను ప్యాకేజీలుగా విడదీసి ఈ-టెండరింగ్ చేపట్టాలి