Mayavati: భారత్ లో ఇప్పటికే పలు సమస్యలు ఉన్నాయి... ఇప్పుడు పెను ముప్పు రాబోతోంది: మాయావతి
- ఆర్థిక మందగమనం భారత్ కు పెను సవాల్ గా మారనుంది
- వ్యాపారస్తులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు
- కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి
పేదరికం, నిరుద్యోగం తదితర సమస్యలతో భారత్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతోందని... ఇప్పుడు ఇండియాకు మరో పెను ముప్పు రాబోతోందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం భారత్ కు పెద్ద సమస్యగా మారనుందని చెప్పారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలను తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో వ్యాపారులు తమ సిబ్బందిని తొలగిస్తున్నారని, మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పారు. సంక్షోభాన్ని నివారించేందుకు తగు చర్యలు తీసుకోకపోతే... రానున్న రోజుల్లో పెను సవాళ్లను ఎదుర్కోవాల్పి వస్తుందని తెలిపారు.